విద్యార్థులు పరిశుభ్రతను బాధ్యతగా చేపట్టాలన్న ఎంపీఓ కూచన ప్రకాష్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రాయపర్తి
రాయపర్తి మండలం మైలారం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 'స్వచ్ఛతా హీ సేవ' కార్యక్రమం జరిగింది. ఎంపీఓ కూచన ప్రకాష్, సర్పంచ్ చిర్ర వేణు హాజరయ్యారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూనే, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను బాధ్యతగా పాటించాలని ప్రకాష్ పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన వాతావరణంలోనే ఆరోగ్యకరమైన ఆలోచనలు, ఉన్నత విద్య సాధ్యమని ఆయన పేర్కొన్నారు. గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచడంలో విద్యార్థుల పాత్ర కీలకమని సర్పంచ్ వేణు అన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో శ్రమదానం చేశారు.