రేవంత్ కేబినెట్‌లోకి విజయశాంతి? మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం కసరత్తు
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. కొండా సురేఖ స్థానంలో ఫైర్‌బ్రాండ్ నేతగా విజయశాంతిని కేబినెట్‌లోకి తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. బీఆర్ఎస్‌ను ఎదుర్కోవడంలో ఆమె వ్యూహాలు, వాగ్ధాటి పార్టీకి కలిసివస్తాయని అధిష్టానం భావిస్తోంది. హోం శాఖ వంటి కీలక బాధ్యతలు ఆశిస్తున్న విజయశాంతితో పాటు, ఆది శ్రీనివాస్‌కు కూడా అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. రేవంత్ రెడ్డి కేబినెట్‌లో సమగ్ర ప్రక్షాళనకు అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది.