తొమ్మిది నెలల ఆకలి కేకలతో సమ్మెబాట పట్టిన మున్సిపల్ కార్మికులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కల్లూరు
కల్లూరు: మున్సిపల్ స్టాఫ్, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు 9 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని AITUC నేతలు డిమాండ్ చేశారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కూనంనేని సాంబశివరావును కలిసి వినతిపత్రం అందించారు. సెప్టెంబర్ 15లోగా వేతనాలు చెల్లించకపోతే సెప్టెంబర్ 16 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.