వర్ధన్నపేటలో వరుస వైన్ షాపుల చోరీలపై తీవ్ర ఆందోళన
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట పట్టణంలో పోలీసుల నిఘా కొరవడటంతో వైన్ షాపులను లక్ష్యంగా చేసుకుని దొంగలు వరుస చోరీలకు పాల్పడుతున్నారు. రాత్రివేళల్లో పెట్రోలింగ్ లేకపోవడంతో రేణుక ఎల్లమ్మ, మల్లికార్జున మరియు శ్రీనివాస వైన్ షాపుల్లో భారీగా నగదు చోరీకి గురైంది. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, వెంటనే దొంగలను పట్టుకోవాలని నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.