షూస్ వేసుకొని వినాయకుడికి కొబ్బరికాయ కొట్టిన ఎమ్మెల్యే రోషన్ కుమార్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: చింతలపూడి
చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే రోషన్ కుమార్ నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వినాయక పూజా కార్యక్రమంలో భాగంగా ఆయన బూట్లు వేసుకొని కొబ్బరికాయ కొట్టారు. సంప్రదాయాన్ని విస్మరించి దైవారాధనలో వ్యవహరించిన తీరుపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులై ఉండి ఇలాంటి పద్ధతులు పాటించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.