టపాసుల వ్యాపారులకు తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
పేలుడు పదార్థాల చట్టం కింద లైసెన్సులు కలిగిన టపాసుల వ్యాపారులు ప్రత్యేకంగా రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ చట్టం కింద లైసెన్స్ పొందాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే దుకాణాలు, గోదాములలో కచ్చితంగా అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించాలని జస్టిస్ సుద్దాల చలపతి రావు ధర్మాసనం తేల్చిచెప్పింది.