కుండీలో పడిపోయిన గోవును రక్షించిన కౌన్సిలర్ బెడ్డల సౌజన్య
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డ్ అంబేద్కర్ నగర్ లో ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ మున్సిపల్ సిబ్బంది సహాయంతో ప్రాణాలతో రక్షించారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎంతో చాకచక్యంగా గోవును బయటకు తీయడంతో స్థానికులు ఆమెను, సిబ్బందిని అభినందించారు.