స్మార్ట్ గ్లాసెస్ గోప్యతా ఉల్లంఘన: మెటాకు లీగల్ నోటీసులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: India
ఢిల్లీలో కేఫ్ లో తన అనుమతి లేకుండా రే-బాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ తో రహస్యంగా వీడియో తీసి ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసిన ఘటనపై ఓ వ్యక్తి మెటాకు లీగల్ నోటీసులు పంపారు. రూ. 2.05 కోట్ల నష్టపరిహారంతో పాటు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గోప్యతా హక్కుల ఉల్లంఘనపై జరుగుతున్న ఈ చట్టపరమైన పోరాటం టెక్ దిగ్గజాలకు పెద్ద పరీక్షగా మారింది.