ఆదోనిలో విషాదం.. భవన నిర్మాణ పనుల్లో కూలీ మృతి

రిపోర్టర్: KISHORE M స్థలం: ఆదోని

ఆదోని పట్టణంలోని తిక్కస్వామి దర్గా సమీపంలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా, నాగలాపురం గ్రామానికి చెందిన మహాదేవ అనే వ్యక్తి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మహాదేవ స్వగ్రామం చిన్నతుంబలం కాగా, గత ఐదేళ్లుగా నాగలాపురం గ్రామంలో నివాసం ఉంటున్నారు. పనిలో ఉండగా జరిగిన ఈ అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.