మహబూబాబాద్ లో బ్లాస్టింగ్ మాఫియా బరితెగింపు: గుట్టల తొలగింపునకు భారీ పేలుళ్లు
రిపోర్టర్: కిరణ్
స్థలం: మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో బ్లాస్టింగ్ మాఫియా ఎలాంటి అనుమతులు లేకుండానే జెలిటిన్ స్టిక్స్ తో భారీ పేలుళ్లకు పాల్పడుతున్నట్లు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు ఎడ్ల మల్లన్న ఆరోపించారు. రాళ్ల భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి, వ్యాపార అవసరాల కోసం గుట్టలను నేలమట్టం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ పేలుళ్లతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, అధికారులు స్పందించి అక్రమ కార్యకలాపాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.