కల్యాణదుర్గంలో ఎలుగుబంట్లు బీభత్సం: లక్షన్నర పైగా పంట నష్టం అంటూ రైతు ఆవేదన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అనంతపురం
కల్యాణదుర్గం మండలం పాపంపల్లిలో ఎలుగుబంట్లు సృష్టించిన బీభత్సం వల్ల రైతుకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతు ఆనంద్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. పాపంపల్లిలో తనకున్న పది ఎకరాల పొలంలో నాలుగు ఎకరాల్లో పుచ్చకాయ సాగు చేయగా, రాత్రివేళ పొలంలోకి చొరబడిన మూడు ఎలుగుబంట్లు సుమారు అర ఎకరం పంటను ధ్వంసం చేశాయి. దీనివల్ల తనకు లక్షా యాభై ఐదు వేల రూపాయల నష్టం జరిగిందని వాపోతూ, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తనకు తగిన నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.