ముంబైలో కలకలం: నటుడు ఆయుష్మాన్ ఖురానాకు లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపులు
రిపోర్టర్: రమేష్
స్థలం: ముంబై
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో కోట్లాది రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరింపు ఆడియో సందేశం వచ్చినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. తాము ఆ గ్యాంగ్ సభ్యులమని చెబుతూ అజ్ఞాత వ్యక్తి వాయిస్ మెసేజ్ పంపాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల వరుస బెదిరింపుల నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.