లాసిక్ సర్జరీతో కంటి సమస్యలు పూర్తిగా తొలగిపోవని వెల్లడి
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
లాసిక్ శస్త్రచికిత్స ద్వారా కంటి చూపు మెరుగైనప్పటికీ తీవ్రమైన మైయోపియా సమస్యలు పూర్తిగా తొలగిపోవని సెంటర్ ఫర్ సైట్ చైర్మన్ డాక్టర్ మహిపాల్ సింగ్ సచ్దేవ్ స్పష్టం చేశారు. లాసిక్ అనేది కేవలం కార్నియా ఆకారాన్ని మాత్రమే మారుస్తుందని, కంటి పొడవును లేదా అంతర్గత నిర్మాణాలను మార్చలేదని ఆయన తెలిపారు. అధిక మైయోపియా ఉన్నవారు రెటినా సంబంధిత సమస్యల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, క్రమం తప్పకుండా నేత్ర వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత కీలకమని డాక్టర్ మహిపాల్ సింగ్ సచ్దేవ్ వెల్లడించారు.