చికాగో హిందూ ఆలయంలో ఘనంగా దీపావళి వేడుకల నిర్వహణ

రిపోర్టర్: అశోక్ స్థలం: Chicago

అమెరికాలోని గ్రేటర్ చికాగో హిందూ ఆలయంలో వచ్చే నవంబర్ ఎనిమిదో తేదీన దీపావళి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ పవిత్ర వేడుకల్లో భాగంగా ఉదయం శ్రీ రామ సుప్రభాతం, మహాలక్ష్మి మూల మూర్తి అభిషేకం, సాయంత్రం దీపోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే బాణాసంచా ప్రదర్శనలు ఉంటాయని వారు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.