తెలంగాణలో పెరుగుతున్న పోలీసుల ఆత్మహత్యలు: సర్కార్ తీరుపై విమర్శలు

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ 33 నెలల పాలనలో ఉద్యోగ ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు, బెట్టింగ్ వ్యసనాలతో 36 మంది పోలీస్ సిబ్బంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. హోమ్ శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని, సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.