'మహిళా గ్రాండ్ మాస్టర్ సాధించడమే నా లక్ష్యం': విశాఖ యువ చెస్ క్రీడాకారిణి సాహితి వర్షిణి

రిపోర్టర్: విజయ్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నానికి చెందిన యువ చెస్ క్రీడాకారిణి ఎం.సాహితి వర్షిణి మహిళల గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకుని సంచలనం సృష్టించారు. సెర్బియాలో జరిగిన టోర్నీలో మూడో నార్మ్‌ను సొంతం చేసుకుని ఈ అరుదైన ఘనత సాధించారు. తండ్రి లోకేశ్వరరావు ప్రోత్సాహంతో చెస్‌లో అడుగుపెట్టిన ఆమె, చిన్నతనంలో డెంగీ నుంచి కోలుకుని పట్టుదలతో అనేక అంతర్జాతీయ పతకాలు, ఆసియా యూత్ టైటిల్స్ సాధించి దేశం గర్వించేలా అడుగులు వేస్తున్నారు.