వంట గ్యాస్ వినియోగదారులకు ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరి

రిపోర్టర్: వెంకట్ స్థలం: న్యూఢిల్లీ

వంట గ్యాస్ సబ్సిడీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి ఎల్‌పీజీ సిలిండర్ రీఫిల్ పొందాలంటే ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరి అని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డెలివరీ సమయంలో సిబ్బంది ద్వారా లేదా మొబైల్ యాప్‌ల ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది.