బొమ్మలకుంటలోనే వినాయక నిమజ్జనం
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని 20 వార్డుల ప్రజలు వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని చిన్నకొండూరులోని బొమ్మలకుంట చెరువులోనే నిర్వహించుకోవాలని ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ సూచించారు. పెద్దకొండూరు వద్ద నిమజ్జనం చేయొద్దని, నిమజ్జనానికి బొమ్మలకుంట వద్ద ఏర్పాటు చేసిన ప్రాంతాన్నే వినియోగించుకోవాలని తెలిపారు. నిమజ్జనం సందర్భంగా అధికారులు, మున్సిపల్ సిబ్బంది సూచనలు పాటించి, భద్రతా ప్రమాణాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని అధికారులు కోరారు.