రోడ్డు భద్రతపై జగిత్యాల పోలీసుల అవగాహన: హెల్మెట్ ప్రాముఖ్యతపై విద్యార్థుల నినాదాలు

రిపోర్టర్: నరేష్ స్థలం: జగిత్యాల

జగిత్యాల ట్రాఫిక్ పోలీసులు మౌంట్ కార్మెల్ స్కూల్ విద్యార్థులతో కలిసి నిర్వహించిన అర్రైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పించారని SP JAGTIAL వెల్లడించారు. హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం ఎంత ముఖ్యమో వివరిస్తూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, సురక్షితమైన ప్రయాణం ద్వారా ప్రాణాలను కాపాడుకోవాలని విద్యార్థులు, పోలీసులు సంయుక్తంగా సూచించినట్లు పేర్కొన్నారు.