రోహిత్ రాయ్ వ్యాఖ్యలపై నటుడు నామన్ షా తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: India
టెలివిజన్ను డస్ట్ బిన్ మీడియంగా అభివర్ణించిన నటుడు రోహిత్ రాయ్ వ్యాఖ్యలపై టెలివిజన్ నటుడు నామన్ షా తీవ్రంగా మండిపడ్డారు. ఎక్కువ బోటాక్స్ వాడటం వల్లే రోహిత్ మెదడు గడ్డకట్టిందని ఘాటుగా విమర్శించారు. ఇరవై ఏళ్లపాటు ఇదే రంగంలో పనిచేసి ఇప్పుడు దాన్ని తక్కువ చేయడం కపటత్వమని, టెలివిజన్ ఎంతోమందికి ఉపాధినిచ్చిందని నామన్ షా అన్నారు.