రేవంత్ పాలనా వైఫల్యంతోనే కరవు పరిస్థితులు అంటూ హరీశ్ రావు ధ్వజం
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన కరవు పరిస్థితులకు ప్రకృతి వైపరీత్యాలు కారణం కాదని, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత విధానాలే కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఇది అతివృష్టి కాదు, అనావృష్టి కాదు, రేవంత్ వృష్టి అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నదుల్ లో నీరు ఉన్నా పంటలకు అందించలేని అసమర్థ స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు.