వైఎస్సార్ కడప జిల్లాలో తీవ్ర కలకలం: ప్రచారంలో మాజీ కార్పొరేటర్పై కత్తితో దాడి

రిపోర్టర్: సునీల్ స్థలం: Kadapa

వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో మాజీ కార్పొరేటర్ షంషీర్పై సయ్యద్ బాషా అనే వ్యక్తి కత్తితో అకస్మాత్తుగా దాడికి తెగబడ్డాడని పోలీసులు తెలిపారు. అమీన్పీర్ దర్గా సమీపంలో జరిగిన ఈ ఘటనలో షంషీర్ చేతికి తీవ్ర గాయమైందని, వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పాత కక్షలా లేక రాజకీయ విబేధాలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారని అధికారులు వెల్లడించారు.