లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లక్ష్యంగా భారత మహిళా క్రికెట్ జట్టు ప్రయాణం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నగోయా
నగోయా వేదికగా ప్రారంభం కానున్న మహిళల క్రికెట్ టోర్నమెంట్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం చేయనుండటంతో, ఈ టోర్నీని ఒలింపిక్స్‌కు సన్నాహకంగా భావిస్తున్నట్లు హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ తెలిపారు. శుక్రవారం జపాన్‌తో జరగనున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌తో భారత జట్టు తన టైైటిల్ పోరును ప్రారంభించనుంది.