అసమానతలను ఎదిరించి సామాజిక విప్లవం సృష్టించిన పెరియార్

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పూలే-పెరియార్-అంబేద్కర్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో ద్రావిడ ఉద్యమనేత పెరియార్ ఈ.వి. రామసామి 147వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుల విగ్రహాల వద్ద నివాళులర్పించి ఆయన చేసిన సామాజిక పోరాటాలను వక్తలు స్మరించుకున్నారు. కుల, మత వివక్షతకు వ్యతిరేకంగా, స్త్రీల అభ్యుదయానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.