'దేశాన్ని స్వయంసమృద్ధిగా తీర్చిదిద్దారు': ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు

రిపోర్టర్: రాము స్థలం: ఆంధ్రప్రదేశ్

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి, రవాణా రంగం ఆధునీకరణకు, యువత సాధికారతకు మోదీ చేస్తున్న కృషిని కొనియాడారు. రక్షణ రంగంలో సాహసోపేత నిర్ణయాలతో భారత్‌ను సరికొత్త శక్తిగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ అందిస్తున్న మద్దతును ఈ సందర్భంగా పవన్ ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.