మక్తల్ హైస్కూల్ క్రీడా పోటీల్లో విద్యార్థుల మధ్య ఉద్రిక్తత
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: నారాయణపేట
నారాయణపేట జిల్లా మక్తల్ హైస్కూల్లో జరిగిన క్రీడా పోటీల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కబడ్డీ పోటీల్లో గెలుపోటముల విషయంలో మొదలైన వివాదం గ్రామస్తులు జోక్యం చేసుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో డ్రగ్స్ ఆరోపణలు రావడంతో పోలీసులు అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎస్సై నవీద్ తెలిపారు. ఘటనపై ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.