గిరిజనుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపుతున్న శాంతను మోహపాత్ర
రిపోర్టర్: రాజేష్
స్థలం: రాయగడ
ఒడిశాలోని రాయగడ జిల్లా మారుమూల గిరిజన ప్రాంతంలో విలాసవంతమైన జీవితాన్ని వదిలి గత ఇరవై ఎనిమిదేళ్లుగా పిల్లలకు అక్షర జ్ఞానాన్ని అందిస్తున్న శాంతను మోహపాత్ర సేవలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. డోంగ్రియా కొంధ్ తెగ ప్రజలను సామాజిక స్రవంతిలోకి తీసుకురావడానికి ఆమె చేస్తున్న కృషి ఎంతో గొప్పదని, చదువుతో పాటు వ్యసనాలకు దూరంగా ఉండాలని చిన్నారులకు నేర్పుతున్నట్లు శాంతను మోహపాత్ర తెలిపారు.