దసరా నవరాత్రులకు ముస్తాబైన సావిడి: దాతృత్వం చాటుకున్న భక్తురాలు అనసూయమ్మ
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో దసరా నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు గాను స్థానిక దసరా సావిడిని సుందరంగా విస్తరించి తీర్చిదిద్దారు. ఇక్కడ ఏటా దసరా వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. అయితే పాత సావిడి స్థలం చిన్నదిగా ఉండటంతో భక్తుల సౌకర్యార్థం దివంగత దువ్వూరు శేషురెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమార్తె అనసూయమ్మ దాతగా ముందుకొచ్చి సావిడిని మరింతగా విస్తరించారు. గ్రామస్తులంతా కలిసి ఆమె సేవాభావాన్ని కొనియాడుతూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారని స్థానిక ప్రజలు సంతోషంగా వెల్లడించారు.