ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చిన రాజ్‌కుమార్ రావు షాహిద్ సినిమా
రిపోర్టర్: గోపి
స్థలం: ముంబై
బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావు కెరీర్లో క్లాసిక్‌గా నిలిచిన షాహిద్ సినిమా ఎట్టకేలకు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమైందని సినీ వర్గాలు వెల్లడించాయి. దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కించిన ఈ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం, థియేటర్లలో విడుదలైన సుమారు పదమూడు సంవత్సరాల తర్వాత ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చింది. మానవ హక్కుల కోసం పోరాడిన ప్రముఖ న్యాయవాది షాహిద్ అజ్మీ నిజ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.