యువత భవిష్యత్తుతో చెలగాటమాడితే కోచింగ్ సెంటర్ల అనుమతులు రద్దు: సీఎం చంద్రబాబు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఆంధ్రప్రదేశ్

పోటీ పరీక్షల అభ్యర్థులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు ప్రేరేపిస్తున్న కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యువత కెరీర్‌తో చెలగాటమాడి రాజకీయ బురదజల్లే దుష్ట ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సంస్థల అనుమతులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.