లవ్ అండ్ వార్ చిత్రంలో అలియా భట్ గ్లామరస్ లుక్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లవ్ అండ్ వార్ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అలియా రెట్రో ఫీల్తో కూడిన ప్రత్యేక గ్లామరస్ లుక్లో కనిపించనున్నారు. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.