ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో వాహనంపై నుంచి పడి యువకుడు దుర్మరణం

రిపోర్టర్: హరి స్థలం: ఖైరతాబాద్

ఖైరతాబాద్ మెట్రో పిల్లర్ నంబర్ 1167 వద్ద గణేష్ నిమజ్జన శోభాయాత్రలో విషాదం చోటుచేసుకుంది. నిమజ్జన వాహనంపైకి ఎక్కబోయిన 20 ఏళ్ల యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఉత్సవాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పోలీసుల లాఠీచార్జ్ వల్లే తమ మిత్రుడు భయపడి కిందపడి మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి స్నేహితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.