భద్రాద్రడి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో ఘనంగా పోషణ మాసోత్సవాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని వేపలగడ్డ అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం పోషణ మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు, గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. వేపలగడ్డ సర్పంచ్ నిరోష ముఖ్య అతిథిగా హాజరై పోషక విలువలతో కూడిన ఆహారం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి తల్లులతో ప్రతిజ్ఞ చేయించారు.