వైద్య నిపుణుల హెచ్చరిక: ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: సిద్దిపేట

మారుతున్న జీవనశైలి కారణంగా ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణుడు డాక్టర్ క్రాంతికుమార్ తెలిపారు. వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. ఈ నాలుగు జిల్లాల్లో నిత్యం సగటున ముగ్గురు నుంచి నలుగురు బాధితులు బారినపడుతున్నారని, తొలి నాలుగున్నర గంటలు అత్యంత కీలకమని, సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామంతో 90 శాతం మేర ముప్పును అడ్డుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.