పిల్లల రక్షణకు పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని సత్యసాయి పోలీసుల పిలుపు

రిపోర్టర్: సునీల్ స్థలం: శ్రీ సత్యసాయి

పిల్లల రక్షణ మనందరి బాధ్యత అని, పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని Satya Sai Police వెల్లడించారు. పిల్లలపై లైంగిక నేరాలకు తావులేకుండా ఉండేందుకు, వారిని వేధింపులు మరియు దోపిడీ నుంచి రక్షించేందుకు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్ యాక్ట్ - 2012 అమల్లో ఉందని పేర్కొన్నారు. పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసున్న బాలబాలికల భద్రతను కాపాడే దిశగా సమాజంలో చైతన్యం అవసరమని తెలిపారు.