రాష్ట్రంలో సంజీవని ప్రాజెక్టు అమలు: జనవరి ఒకటి నుంచి డిజిటల్ ఆరోగ్య సేవలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ డిజిటల్ ఆరోగ్య వ్యవస్థతో అనుసంధానం చేయడానికి నిర్దేశించిన సంజీవని ప్రాజెక్టును జనవరి మొదటి తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీనిలో భాగంగా డిసెంబరు పదవ తేదీన సాఫ్ట్ లాంచ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆరోగ్య సిబ్బందికి శిక్షణలు పూర్తయ్యాక నవంబరు మూడో తేదీ నుంచి నాన్ సిటిజన్ డ్రైవ్ నిర్వహించి ప్రజల ఆరోగ్య వివరాలు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.