బిగ్ బాస్ 10లో ఊహించని ట్విస్టులు, ఆరుగురు హౌజ్‌మేట్స్ కన్ఫర్మ్!

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆసక్తికరంగా సాగుతోంది. మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో చరణ్ మహాదేవ్, చైత్ర రాయ్ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వారాంతంలో ఎలిమినేషన్ లేదని నాగార్జున స్పష్టం చేశారు. త్రిగుణ్, శాలిని, దేబ్జానీ మోదక్ కొత్తగా హౌజ్‌మేట్స్‌గా ఎంపికయ్యారు. దీంతో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు హౌజ్‌మేట్స్‌గా మారగా, మిగిలిన ఎనిమిది మందిపై ఎలిమినేషన్ ఒత్తిడి పెరిగింది.