తుఫాను ముప్పు వేళ కంట్రోల్ రూమ్లోనే రాత్రంతా గడిపిన కలెక్టర్

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో తుఫాను ముప్పు వేళ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి రాత్రంతా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్లోనే గడిపి పరిస్థితిని సమీక్షించారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం ఉదయం 5 గంటల వరకు అక్కడే ఉండి అధికారులను అప్రమత్తం చేశారు. సీఎం చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో పాల్గొని జిల్లాలో తీసుకున్న ముందస్తు చర్యలను వివరించారు.