వాట్సాప్ లో సరికొత్త ఫీచర్: స్మార్ట్ టెక్స్ట్ యాక్షన్స్ విడుదల

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకువచ్చినట్లు టెక్కీ నిపుణులు తెలిపారు. ఈ ఫీచర్ ద్వారా చాటింగ్ లో ఫోన్ నంబర్లు, తేదీలు, ఈమెయిల్ అడ్రస్ లను ఆటోమేటిక్ గా గుర్తించి షార్ట్ కట్స్ అందిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ అప్ డేట్ అందుబాటులోకి వచ్చిందని, దీని ద్వారా రోజువారీ పనులు మరింత సులభంగా నిర్వహించుకోవచ్చని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.