చార్లీ కిర్క్ వ్యాఖ్యలపై ఇల్হান ఒమర్‌ వివాదం

రిపోర్టర్: శివ స్థలం: World

చార్లీ కిర్క్ లగసీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా ప్రతినిధి ఇల్హాన్ ఒమర్‌పై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. కిర్క్ రికార్డులో కేవలం ద్వేషం, జాతి దురహంకారమే ఉందని ఆమె విమర్శించారు. మరోవైపు, ఇల్హాన్ ఒమర్‌పై ఉన్న ఇమ్మిగ్రేషన్ మోసం ఆరోపణలు, వివాహం చుట్టూ ఉన్న అనుమానాలపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ దర్యాప్తు జరుపుతున్నట్లు వైట్‌హౌస్ బోర్డర్ అధికారి టామ్ హోమన్ తెలిపారు.