విదేశీ విరాళాల చట్ట సవరణ బిల్లుపై షిల్లాంగ్ లో సంయుక్త పార్లమెంటరీ కమిటీ తొలి భేటీ

రిపోర్టర్: హరి స్థలం: Shillong

విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ షిల్లాంగ్ లో సమావేశమైందని కమిటీ ఛైర్మన్ సంజయ్ జైస్వాల్ తెలిపారు. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా విజ్ఞప్తి మేరకు ఈ సమావేశాన్ని ఢిల్లీ వెలుపల తొలిసారిగా నిర్వహించామన్నారు. ఈ భేటీలో ఈశాన్య రాష్ట్రాల నుంచి దాదాపు నలభై సంస్థలు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించాయని, దేశ భద్రతను కాపాడుతూనే సామాజిక సేవను రక్షించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.