బషీర్ బాగ్ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై క్షేత్రస్థాయి తనిఖీలు

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ బషీర్ బాగ్ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. హౌసింగ్ బోర్డు వైస్ వీపీ గౌతం నేతృత్వంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, అర్హులైన పేదలను గుర్తించేందుకు సమగ్ర విచారణ చేపట్టారు. ఎటువంటి సిఫార్సులకు తావులేకుండా, పారదర్శకంగా నిజమైన నిరుపేదలకే ఇళ్లు కేటాయిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అనర్హులను తొలగించి, అర్హుల జాబితాను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.