నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఎస్ఎస్సి ఎస్ఐ పరీక్ష ఫలితాల విడుదల
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఐ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. జూలై 21 నుంచి 30 వరకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఈ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తదుపరి పేపర్-2 పరీక్షకు హాజరడానికి అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలను పరిశీలించుకోవచ్చని సూచించారు.