పాఠశాలలో విద్యార్థులకు అందించిన అల్పాహారంలో బల్లి కలకలం

రిపోర్టర్: హరి స్థలం: తిరువళ్లూరు

తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించిన అల్పాహారంలో బల్లి కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనలో ఆహారం తీసుకున్న తర్వాత వాంతులు, మైకం వంటి లక్షణాలతో 36 మంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. జిల్లా కలెక్టర్ కవిత ఆస్పత్రిని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.