ప్రేమాయణం వెబ్ సిరీస్‌కు విశేష స్పందన: యూట్యూబ్‌లో దూసుకుపోతున్న అందమైన ప్రేమకథ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
ప్రేమ, భావోద్వేగాల అద్భుతమైన మేళవింపుతో తెరకెక్కిన ప్రేమాయణం వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని చిత్ర బృందం వెల్లడించింది. అక్టోబర్ ఇరవై మూడో తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ అందమైన ప్రేమకథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సూర్య మురపాక దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌పై యూత్‌లో విపరీతమైన క్రేజ్ పెరుగుతోందని మేకర్స్ తెలిపారు.