ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో ఉప్పల్ భగాయత్ వద్ద ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మాజీ సీఎం రోశయ్య దూరదృష్టి వల్లే రాష్ట్రానికి మిగులు బడ్జెట్ వచ్చిందని కొనియాడారు. ఈ భవనం పేద ఆర్యవైశ్యుల బిడ్డలకు కూడా ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఈ వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు.