అక్టోబర్ తొమ్మిదిన ఆదర్శ కుటుంబం సినిమా విడుదలని స్పష్టం చేసిన నాగవంశీ

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

అక్టోబర్ తొమ్మిదో తేదీన ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 సినిమా విడుదల కానుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పష్టం చేశారు. చిత్ర విడుదలపై వస్తున్న వాయిదా సందేహాలకు ఆయన తెరదించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే సినిమా థియేటర్లలోకి వస్తుందని, అయితే ప్రీమియర్ షోలు మాత్రం ఉండవని తెలిపారు. అక్టోబర్ ఆరో తేదీన ట్రైలర్ విడుదల చేసి, ఏడో తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్లు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.