కూరగాయలతో వినాయకుడిని చేసి మతసామరస్యం చాటిన ముస్లిం విద్యార్థిని
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న అజీజా అనే ముస్లిం విద్యార్థిని కూరగాయలతో వినాయకుడి ప్రతిమను అత్యంత అందంగా తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించింది. మతసామరస్యానికి అతీతంగా అందరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని ఆమె ఈ రూపంలో చాటి చెప్పింది. విద్యార్థిని చేసిన వినూత్న ప్రయత్నాన్ని, ఆమె ఆలోచనను పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.