ఇట్లు అర్జున ట్రైలర్ విడుదల: అనీష్ను ప్రశంసించిన స్టార్ హీరో ఎన్టీఆర్

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

అనీష్ హీరోగా నటిస్తున్న ఇట్లు అర్జున సినిమా ట్రైలర్ను అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ విడుదల చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించడం అనీష్ ధైర్యానికి నిదర్శనమని ఎన్టీఆర్ ప్రశంసించినట్లు వారు వెల్లడించారు. మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేసింది.