బెంగళూరు పబ్ వివాదం: ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ బదిలీ
రిపోర్టర్: విజయ్
స్థలం: Amaravati
బెంగళూరులో పబ్ లో పోలీసులపై దాడికి పాల్పడిన కుప్పం ప్రాంతీయ అభివృద్ధి సంస్థ సంచాలకుడు, ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.